మిల్లర్లతో కుమ్మక్కై ఎమ్మెల్యేలు, మంత్రులు రైతులను దోచుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రైతుల బకాయి సొమ్ములు చెల్లించకపోవడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ధాన్యం బకాయిలు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు. పౌరసరఫరాల శాఖలో రూ.3 కోట్లతో ఒక డీఎం మంత్రికి ఇల్లు కట్టించి ఇచ్చాడని వెల్లడించారు. అన్నదాతలకు భరోసా ఇవ్వని రైతు భరోసా కేంద్రాలు ఎందుకని ప్రశ్నించిన సోము వీర్రాజు.. రెండేళ్ల నుంచి తుంపర సేద్యానికి నిధులు ఇవ్వట్లేదని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమాన్ని విస్మరించారు...