ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 31, 2022, 7:02 PM IST

ETV Bharat / city

పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించే వరకు ఉద్యమిస్తాం : బీజేపీ

BJP Leaders on Electricity charges: విద్యుత్​ ఛార్జీల పెంపుపై రాష్ట్ర భాజపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ... ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు.

bjp leaders on power charges hike in ap
భాజపా

విద్యుత్​ ఛార్జీల పెంపుపై రాష్ట్ర భాజపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో సామాన్యులపై ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం మోపిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించే వరకు ఉద్యమిస్తామని సోమువీర్రాజు హెచ్చరించారు.

వైకాపా హయాంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు: భానుప్రకాష్‌

వైకాపా హయాంలో 7 సార్లు ఛార్జీల మోత: వైకాపా అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను ఏడు సార్లు పెంచిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటలను జగన్ తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెను భారం పడిందన్నారు. వైకాపా ప్రభుత్వం.. రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్తుందని ధ్వజమెత్తారు. ఫ్యాన్ స్విచ్ కూడా వేసుకోలేని దుస్థితికి ప్రజలను తీసుకొచ్చారని మండిపడ్డారు.

వైకాపా హయాంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఫలితంగా.. 45 శాతం మధ్యతరగతి కుటుంబాలపై పెను భారం పడింది. ఫ్యాన్ స్విచ్ కూడా వేసుకోలేని దుస్థితికి ప్రజలను తీసుకొచ్చారు. అవినీతితో పరిపాలించే అర్హతను వైకాపా కోల్పోయింది.- భానుప్రకాష్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details