విజయవాడలో భాజపా ముఖ్యనేతల భేటీ - విజయవాడలో భాజపా ముఖ్యనేతలు భేటీ
జనసేనతో కలసి నడవడం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం కోసం విజయవాడలో భాజపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత జనసేన ముఖ్య నేతలతోనూ సమావేశమవుతామని చెప్పారు.
bjp leaders meeting in vijayawada
విజయవాడలో భాజపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. పార్టీ కార్యాలయంలో జరగుతున్న సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సోము వీర్రాజుతో సహా.. ఇతర నేతలు హాజరయ్యారు. జనసేన పార్టీతో కలిసి వెళ్లే అంశంపై ప్రధానంగా చర్చిస్తామని భాజపా నేతలు తెలిపారు. సమావేశం తర్వాత జనసేన ముఖ్య నేతలతోనూ మాట్లాడతామన్నారు. 2024 వరకు జనసేనతో కలిసి ఏం చేయాలో కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు.