ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చలో అమలాపురానికి అనుమతి నిరాకరణ... భాజపా నాయకుల గృహ నిర్బంధం

అంతర్వేది ఘటనకు నిరసనగా శుక్రవారం చలో అమలాపురానికి భాజపా పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఆ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, నేతలు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్ రాజు తదితరులను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.

ఛలో అమలాపురానికి అనుమతి నిరాకరణ
ఛలో అమలాపురానికి అనుమతి నిరాకరణ

By

Published : Sep 17, 2020, 6:39 PM IST

Updated : Sep 17, 2020, 8:25 PM IST

అంతర్వేది రథం దగ్ధం ఘటనకు నిరసనగా రేపు చలో అమలాపురానికి భాజపా పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు చేపట్టారు. విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును గృహ నిర్బంధంలో ఉంచారు. అమలాపురంలో సెక్షన్‌ 30,144 అమల్లో ఉందని ఆయనను నిలువరించారు. పోలీసుల వైఖరికి నిరసనగా భాజాపా శ్రేణులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులోని ఆయన నివాసంలోనే నిర్బంధించారు. విశాఖ నుంచి బయల్దేరబోతున్న విష్ణుకుమార్‌రాజును అక్కడే ఆపేశారు. పోలీసు వారి చర్యలను విష్ణుకుమార్ రాజు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజా హక్కుల అణిచివేతకు ఇది నిదర్శనమన్నారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పాలకొండ నియోజకవర్గం ఇన్​చార్జ్ తాడంకి సునీతతోపాటు ఆమె భర్త పవన్ సాయి ఇతర నాయకులను నిర్భందంలో ఉంచారు. చలో అమలాపురం కార్యక్రమానికి ఎలాంటి అనుమతులూ లేవని... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ప్రభుత్వమే మతమార్పిడిలను ప్రోత్సహిస్తున్నట్లు ఉంది..: కన్నా లక్ష్మీనారాయణ, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు

రాష్టంలోని దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను చూస్తుంటే... ప్రభుత్వమే మతమార్పిడిలను ప్రోత్సహిస్తున్నట్లు ఉందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా చేపట్టిన చలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు. దేవాలయాలు పైన వరుస దాడులు జరుగుతున్న స్పందించని రాష్ట్ర ప్రభుత్వం.. చర్చి పై రాళ్లు విసిరారన్న నేపతంతో41 మంది ని అరెస్ట్ చేయడం హేయమైన చర్యన్నారు.ఇకనైనా విధానాలను మార్చుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

ఈ ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమా ?: సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఈ ప్రభుత్వానికి ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యమా అని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నిలదీశారు. దాడులను ప్రశ్నిస్తే... తమ పార్టీ వారిని అరెస్టులు చేశారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తోందని... హిందూ ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ అలసత్వాన్ని ఎండగడతామన్నారు. హిందూ ఆలయాలపై దాడులు చేసిన వారిని పిచ్చొళ్లుగా చెబుతున్నారని... చర్చిలపై రాళ్లు వేసిన వారు పిచ్చోళ్లు కాదా? అని ప్రశ్నించారు.

ఇదీచదవండి

సొంత పార్టీ ఎంపీపై స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

Last Updated : Sep 17, 2020, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details