'రాష్ట్రంలో ఈసీ సమర్థంగా పని చేస్తోంది' - kanna
ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై రాష్ట్ర భాజపా నేతలు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ సమర్థంగా పని చేస్తోందని భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై రాష్ట్ర భాజపా నేతలు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ సమర్థంగా పని చేస్తోందని... దేశంలో ఎక్కడా లేని విధంగా నగదు పట్టుబడిందని రాష్ట్ర భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సీఎం ఒత్తిడికి తలొగ్గకుండా ఈసీ నిష్పాక్షికంగా పని చేయాలని ఆయన కోరారు.
ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారని, భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థ మీద అపోహలు సృష్టించి లాభపడాలని తెదేపా నేతలు భావిస్తున్నారని విమర్శించారు.
కొన్నిచోట్ల పోలీసులే డబ్బు పంచుతున్నారని ఆరోపిస్తూ, భాజపా నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారని, మంగళగిరి లాంటి నియోజక వర్గాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.