ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపాలో చేరాలని హింసిస్తున్నారు.. ఎస్సైపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

భాజపాను వీడి వైకాపాలో చేరాలంటూ ముచ్చుమర్రి ఎస్‌ఐ శ్రీనివాసులు తమను హింసిస్తున్నారని కర్నూలు జిల్లా ముచ్చుమర్రికి చెందిన కరీం బాషా, జలీల్‌ బాషా, సయ్యద్‌ జలాల్‌ బాషా జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సభ్యురాలు జ్యోతి క్లారా, జాతీయ మైనారిటీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అతీఫ్‌ రషీద్‌లకు సోమవారం ఫిర్యాదు చేశారు.

వైకాపాలో చేరాలని హింసిస్తున్నారు.. ఎస్సైపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
వైకాపాలో చేరాలని హింసిస్తున్నారు.. ఎస్సైపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

By

Published : Jan 19, 2021, 7:17 AM IST

గతేడాది ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌ సమయంలో మసీదు వివాదమంటూ పిలిచిన ఎస్‌ఐ శ్రీనివాసులు తనపై దాడి చేశారని కరీంబాషా ఆరోపించారు. భాజపాను వీడి వైకాపాలో చేరకుంటే గ్రామం వదిలి వెళ్లాలని, తలపై రివాల్వర్‌ పెట్టి బెదిరించారన్నారు. మండల పరిషత్‌ ఎన్నికల్లో పోటీకి భాజపా తరఫున నామినేషన్‌ వేసినందుకు గతేడాది మే 19న తన ఇంటిపైకి 300 మందితో కలిసి వచ్చిన వైకాపా నేత సిద్ధార్థరెడ్డి.. దాడి చేసి తనను, కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపర్చారని వాపోయారు.

ఈనెల 12న రైతులు, మార్కెట్‌ ఏజెంట్లతో తన ఇంటి వద్ద సమావేశం పెట్టుకోగా నాగరాజు అనే వ్యక్తి కేకలు వేస్తుండడంతో దూరంగా వెళ్లమని కోరగా... అతను ఎస్‌ఐ శ్రీనివాసులును పిలుచుకువచ్చారని తెలిపారు. ఎస్‌ఐ తనను, జలీల్‌బాషాను ఠాణాకు తీసుకువెళ్లి అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు కొట్టారని ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా వైకాపాలో చేరాలని పదేపదే హెచ్చరించారన్నారు. తాము గాయపడినప్పటి ఫొటోలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ, మైనారిటీ కమిషన్‌కు వారు అందజేశారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని, సిద్ధార్థరెడ్డితోపాటు ఇతరులపై కేసులు నమోదు చేయాలని విన్నవించారు.

ఇదీ చదవండి:నేడు దిల్లీకి సీఎం జగన్... అమిత్​ షాను కలిసే అవకాశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details