ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోదీ పాలనకు ఏడేళ్లు.. భాజపా నేతల సేవా కార్యక్రమాలు - bjp leaders celebration of modi 7 years tenure

ప్రధాని నరేంద్రమోదీ ఏడేళ్ల పాలన పూర్తిని పురస్కరించుకుని.. భాజపా నేతలు పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. మోదీ హయాంలో దేశం సాధించిన పురోగతిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఏకరవు పెట్టారు. కరోనా కట్టడిలో వైకాపా విఫలమైందన్నారు.

bjp leaders on cm jagan
మోదీ 7 ఏళ్ల పాలన సందర్భంగా భాజపా సేవాకార్యక్రమాలు

By

Published : May 30, 2021, 1:51 PM IST

ప్రధానిగా నరేంద్రమోదీ పరిపాలనకు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవా హి సంఘటన్‌ పేరిట పారిశుద్ధ్య కార్మికులు, ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆహార ధాన్యాలు, నిత్యావసర సరకులు అందించారు. లయన్స్‌క్లబ్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. తెదేపా కరోనా సమయంలో సామాజిక సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మోదీ పాలనలో దేశం ముందుకు..

భారతీయ జనతా పార్టీ యువమోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో 7,000 గ్రామాల్లో సేవా హి సంఘటన్‌ కార్యక్రమాలు చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. 50 వేల యూనిట్ల రక్తం సేకరించి రక్తనిధి కేంద్రాలకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని శక్తివంతమైనదిగా నిలబెట్టిన ఘనత నరేంద్రమోదీకి దక్కుతుందన్నారు. డిఫెన్స్‌, ఫార్మాసిటికల్‌, ఆయిల్‌ మాఫియాలు నివ్వెరపోయేలా స్వదేశీ పరిజ్ఞానంతో మేకిన్‌ ఇండియా ద్వారా మిసైల్స్‌, ఔషదాలను తయారు చేయడం అభివృద్ధికి సంకేతమన్నారు. రాజకీయ పార్టీలు విమర్శలు కంటే విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనేది ఆచరణలో చూపించడం తమ పార్టీ ఆలోచనని పేర్కొన్నారు. రాష్ట్రానికి పీఎం కేర్స్‌లో భాగంగా 4,000 వెంటిలేటర్లు.. ఆక్సిజన్‌ ఇస్తే.. వాటిని సద్వినియోగపరచలేదని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ఏకరవు..

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ కట్టడి విషయంలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రతి జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మించాలని చెప్పినా.. వాటిని ముందస్తు ప్రణాళికతో ఉపయోగించలేదన్నారు. రూ. 2 వేల కోట్లు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని సూచించినా.. పట్టించుకోలేదని.. ప్రజల ప్రాణాలపై ద్యాసలేదంటూ విమర్శించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెంచే ఆలోచన వైకాపా ప్రభుత్వానికి లేదని.. కేవలం సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. వాలంటీరు వ్యవస్థతో పరిపాలన నిర్వహించాలనే అంశాలు తప్ప విధివిధానాలపై సరైన ఆలోచన లేదన్నారు. ప్రైవేటు స్కూళ్ల వ్యవస్థ చిన్నాభిన్నమైందని.. పేదలకు జాతీయ కార్పొరేషన్‌ నిధులు వినియోగించడంలేదన్న సోము.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబట్టారు.

ఇవీ చదవండి:

మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి శశికళ!

సంపద సృష్టించి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details