ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'15 ఏళ్లు కౌలు ఇస్తామన్న జగన్ హామీలు ఏమయ్యాయి?' - amaravati farmers protest news

విజయవాడలోని ఏఎంఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించి అరెస్టైన రైతులను సూర్యారావుపేట పోలీస్ స్టేషన్​లో భాజపా నేతలు పరామర్శించారు. పోలీసుల చర్యలను ఖండించారు. అమరావతి ప్రాంత రైతులకు న్యాయం జరిగే వరకూ.. వారి పక్షాన పోరాడతామని చెప్పారు.

bjp leader visited amaravati farmers who arrested in vijayawada
bjp leader visited amaravati farmers who arrested in vijayawada

By

Published : Aug 26, 2020, 7:10 PM IST

ఎన్నికల సమయంలో రాజధాని రైతులకు 15 సంవత్సరాలు కౌలు ఇస్తామని జగన్​ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని భాజపా విజయవాడ అధ్యక్షుడు సత్యమూర్తి ప్రశ్నించారు. కౌలు కోసం వచ్చిన రైతులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అరెస్టై... సూర్యారావుపేట పోలీస్​స్టేషన్​లో ఉన్న రైతులను ఆయన పరామర్శించారు.

తమకు రావాల్సిన కౌలు అడగడానికి వచ్చిన రైతులపై పోలీసుల తీరు ఆక్షేపణీయమని సత్యమూర్తి అన్నారు. మహిళా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. వారికి న్యాయం జరిగే వరకు భాజపా పోరాడుతుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details