కడప జిల్లా బద్వేలులో.. పోలీసులకు, వైకాపా కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీ లేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. వైకాపా కార్యకర్తల కంటే ఘోరంగా ఆ పార్టీకి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నాడు తిరుపతి ఉప ఎన్నికలో ఏ రకంగా దొంగ ఓట్లు వేశారో.. దాన్నే బద్వేలులో పునరావృతం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా అని మండిపడ్డారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. గోవిందరెడ్డిని ఎందుకు అన్ని మండలాల్లో తిరగడానికి పోలీసులు అనుమతిస్తున్నారని నిలదీశారు.
Vishnuvardhan Reddy: దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా: విష్ణువర్థన్ రెడ్డి
బద్వేలులో పోలీసులకు, వైకాపా కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీ లేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. వైకాపా కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు ఆ పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా అని మండిపడ్డారు.
దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా: విష్ణువర్థన్ రెడ్డి