రాష్ట్రంలో మద్యం ధరల గురించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడితే.. ఆయన మీద ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ అన్నారు. రాజ్యాంగ విధానాలను అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తుంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల అరాచక పాలనను భరించామని, కొత్త సంవత్సరంలోనైనా సీఎం బుద్ధి మారాలని భగవంతుడిని కోరుతున్నానన్నారు. మద్యం, డబ్బులు పంచకుండా ఉంటే అధికార పార్టీకి 15 సీట్లూ రావని ఆక్షేపించారు.
రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వం...నేడు అర్ధరాత్రి వరకు బార్లకు ఎలా అనుమతి ఇచ్చింది. జగన్ పాలనలో ఒక్క ఇల్లూ కట్టించలేదు. ప్రజల్లో వైకాపాపై వ్యతిరేకత పెరిగింది. మంత్రి నారాయణ స్వామి వారి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. బెయిల్ మీద ఎక్కువ కాలం బయట ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. - విష్ణు కుమార్, భాజపా నేత