ముషీరాబాద్ నియోజకవర్గంలో అర్హులకే టికెట్లు ఇవ్వాలంటూ భాజపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లోని క్యాంప్ కార్యాలయం ముందు ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
టికెట్ కోసం భాజపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం - జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కోసం బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం వార్తలు
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ భాజపా కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సికింద్రాబాద్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాడు.

టికెట్ కోసం భాజపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం
పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకులకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. అక్రమదందాలు చేసేవారినే ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని భాజపా నేతలను నిలదీశారు.