Veeraju on CM jagan కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పథకాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం తామే చేపడుతున్నట్లు సొంతపేర్లు పెట్టుకుంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. బటన్ నొక్కడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం....అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్రం 35 లక్షల ఇల్లు ఇస్తే... ఇప్పటి వరకూ పూర్తి చెయ్యలేదని తెలిపారు. అమరావతి నిర్మాణానికి నిధులిస్తే...ఏపీకి అసలు రాజధానే లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఈనెల 21న విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సోమువీర్రాజు తెలిపారు. ఈ సభకు కేంద్రమంత్రులు హాజరుకానున్నట్లు వివరించారు.
Veeraju on CM jagan ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఈనెల 21న విజయవాడలో భారీ బహిరంగ సభ - సీఎం జగన్పై సోము వీర్రాజు
Veeraju on CM jagan జగన్ ప్రభుత్వం బటన్ నొక్కడమే పనిగా పెట్టుకుందని భాజపా నేత సోము వీర్రాజు అన్నారు. కేంద్ర నిధులు సొంత ఖాతా నుంచి ఇచ్చినట్లు పంచుతున్నారన్నారు. ఈనెల 21 విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో భూములను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
సోము వీర్రాజు