SOMU ON COMMUNIST PARTIES : విశాఖపట్నం భూములను వైకాపా నేత విజయసాయి రెడ్డి తన బంధువులకు కట్టబెట్టారని.. తిరిగి తన కుటుంబ సభ్యులు భూములు కొంటే నాకేమీ సంబంధమని ప్రశ్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు దుయ్యబట్టారు. కుటుంబ పరిపాలన, అవినీతి పాలనను ఓడించి భాజపాను రాష్ట్రంలో గెలిపించాలని విజయవాడలో జరిగిన భాజపా రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రజలను కోరారు. కమ్యూనిస్టులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. కమ్యూనిస్ట్ పార్టీలకు దేశ భక్తి లేదని.. అందుకే వీళ్లను ప్రజలు పట్టించుకోవడం మానేశారన్నారు. భాజపాను అధికారం నుంచి దూరం చేస్తామని కమ్యూనిస్టులు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు.
భాజపాపై కమ్యూనిస్టుల ప్రకటనలు హాస్యాస్పదం : సోము వీర్రాజు - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
SOMU VEERRAJU ON COMMUNIST PARTY : కమ్యూనిస్టులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కమ్యూనిస్ట్ పార్టీలకు దేశ భక్తి లేదని.. అందుకే వాళ్లను ప్రజలు పట్టించుకోవడం మానేశారన్నారు. భాజపాను అధికారం నుంచి దూరం చేస్తామని కమ్యూనిస్టులు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు.
![భాజపాపై కమ్యూనిస్టుల ప్రకటనలు హాస్యాస్పదం : సోము వీర్రాజు SOMU VEERRAJU ON COMMUNIST PARTY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16664021-321-16664021-1665928909680.jpg)
SOMU VEERRAJU ON COMMUNIST PARTY
భాజపాను అధికారం నుంచి దూరం చేస్తామని కమ్యూనిస్టులు ప్రకటించడం హాస్యాస్పదం
విశాఖపట్నం అభివృద్ధికి భాజపా అన్ని విధాలా సహకారం అందించిందన్నారు. రాష్ట్రంలోని రహదారులను అభివృద్ధి చేస్తూ.. వాటికి నిధులు కేటాయిస్తుంది భాజపానే అని అన్నారు. మోదీ అభివృద్ధి చేస్తుంటే వైకాపా దందాలు నడుపుతుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని విమానాశ్రయాలను అభివృద్ధి చేసింది తమ పార్టీ అని పేర్కొన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడని ఆరోపించారు. ప్రముఖ డాక్టర్లు అంగూర్ పార్థసారథి, మహమ్మద్ మూసలు భాజపాలో చేరారు.
ఇవీ చదవండి: