ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తుపాను బాధిత మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి' - తుపాను బాధితులపై సోము వీర్రాజు కామెంట్స్

తుపాను మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టం అంచనాకు మండలానికో అధికారిని నియమించి.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.

తుపాను బాధిత మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
తుపాను బాధిత మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి

By

Published : Nov 28, 2020, 9:18 PM IST

తుపాను మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరి, వాణిజ్య పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

పరిహారం కింద అన్నదాతలకు తక్షణం రూ.25 వేలు సాయం అందించాలన్నారు. నష్టం అంచనాకు మండలానికో అధికారిని నియమించి.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details