ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మంత్రి కొడాలి వ్యాఖ్యలను బట్టే వైకాపా పాలన తీరు తెలుస్తోంది' - మంత్రి కొడాలి నాని తాజా కామెంట్స్

మంత్రి కొడాలి వ్యాఖ్యలను బట్టే రాష్ట్రంలో వైకాపా పాలన ఎలా సాగుతుందో తెలుసుకోవచ్చని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. ఒపప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దయతో తెదేపాలో గెలిచి...ఇప్పుడు చంద్రబాబును తిడుతున్నారని ఆక్షేపించారు.

'మంత్రి కొడాలి వ్యాఖ్యలను బట్టే వైకాపా పాలన తీరు తెలుస్తోంది'
'మంత్రి కొడాలి వ్యాఖ్యలను బట్టే వైకాపా పాలన తీరు తెలుస్తోంది'

By

Published : Sep 25, 2020, 4:20 PM IST

వైకాపా పాలన ఎలా సాగుతుందో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు వింటే తెలుస్తుందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. దేవుడి గురించి ప్రస్తావించేటపుడు పరుష పదాలతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి మాట్లాతున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దయతో తెదేపాలో గెలిచి...ఇప్పుడు చంద్రబాబును తిడుతున్నారని ఆక్షేపించారు. ఇంత జరగుతున్నా..సీఎం జగన్ ఎందుకు అదుపులో పెట్టటంలేదని ప్రశ్నించారు. భాష మార్చుకోకపోతే...తాము కూడా తగిన విధంగా సమాధానం చెబుతుమన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ కనిపించరు...వినిపించరని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రికి అవగాహన లేకుంటే లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకున్న సలహాదారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details