SATYAKUMAR:జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వైకాపా ట్రాప్‌లో పడుతున్నారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘పొత్తుల గురించి ఎన్నికలప్పుడే మాట్లాడతారు. ఇప్పుడు అప్రస్తుతం. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఎన్నికల సమయంలో అధిష్ఠానం ప్రకటిస్తుంది. భాజపా తరఫువారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండటం సంప్రదాయంగా వస్తోంది. అధికార పార్టీపై పవన్ పోరాడుతున్నారు. దీని దృష్టిని మరల్చేందుకు వైకాపా పొత్తుల గురించి మాట్లాడుతోంది. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా.. వైకాపా పొత్తుల గురించి మాట్లాడటం మైండ్‌గేమ్. గత ఎన్నికల్లో చంద్రబాబు పడినట్లే.. ఇప్పుడు పవన్ వైకాపా ట్రాప్‌లో పడుతున్నారు. ప్రజాదరణ కలిగిన పవన్ వైకాపా ట్రాప్‌లో పడొద్దని సూచిస్తున్నా. భాజపా కార్యకర్తల్లోనూ పలువురు వైకాపా మైండ్‌గేమ్ రాజకీయాలకు ప్రభావితమవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి’ అని సత్యకుమార్ పేర్కొన్నారు.
SATYAKUMAR: వైకాపా ట్రాప్‌లో అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు పవన్: భాజపా నేత సత్యకుమార్ - latest news in ap
SATYAKUMAR: పొత్తుల గురించి, సీఎం అభ్యర్థి గురించి ఇప్పుడే ప్రస్తావన అప్రస్తుతమని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ అన్నారు. వైకాపా ట్రాప్‌లో అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు పవన్ పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని సమస్యలని పక్క దారి పట్టించేందుకు వైకాపా పొత్తుల గురించి చర్చ పెడుతోందని అన్నారు.

SATYAKUMAR