సీఎం జగన్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. అధికారంలోకి వచ్చి ఒక్కో వ్యవస్థను నిర్వీర్యం చేశారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. విజయవాడలో స్థానిక సమస్యలపై భాజపా చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. అవసరం లేని సలహాదారులకు నెలకు కోట్ల రూపాయలు దోచి పెడుతున్నారని ఆరోపించారు. సొంత ఆస్తి ఖర్చు పెడుతున్నట్లుగా పథకాలకు జగన్ పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. అమరావతికి నిధులు కేటాయించి.. అనంతపురం నుంచి అమరావతి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులను మంజూరు చేసిన ఘనత ప్రధాని మోదీదని సత్యకుమార్ కొనియాడారు.
'సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీరం చేశారు' - bjp comments on ysrcp
సీఎం జగన్పై భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీరం చేశారని ఆరోపించారు.
bjp leader satya kumar