Yamini sharma: వైకాపా చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సభలకు డ్వాక్రా మహిళలను తరలించడం చట్టవిరుద్ధమని.. భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామినీశర్మ స్పష్టం చేశారు. సభలకు రాకపోతే రూ.500 నుంచి రూ.2వేల వరకు జరిమానా విధిస్తామంటూ వాలంటీర్ల ద్వారా మహిళలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై సీఎస్ సమీర్‌శర్మకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారని గుర్తు చేశారు. భాజపా అంటే వైకాపాకు భయం పట్టుకుందని పేర్కొన్నారు. అమలాపురం ఘటనలో భాజపాపై బురదజల్లాలని చూశారని.. భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బి. నాగలక్ష్మి విమర్శించారు.
Yamini sharma: వైకాపా సభలకు డ్వాక్రా మహిళల తరలింపు చట్టవిరుద్ధం: యామిని శర్మ - వైకాపాపై యామిని సాధినేని ఆగ్రహం
Yamini sharma: వైకాపా చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సభలకు డ్వాక్రా మహిళలను తరలించడం చట్టవిరుద్ధమని.. భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామినీశర్మ స్పష్టం చేశారు. సభలకు హాజరవ్వకుంటే జరిమానా విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.
![Yamini sharma: వైకాపా సభలకు డ్వాక్రా మహిళల తరలింపు చట్టవిరుద్ధం: యామిని శర్మ bjp leader sadineni yamini fires on ysrcp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15414925-357-15414925-1653794775644.jpg)
వైకాపాపై యామినీ శర్మ మండిపాటు
వైకాపాపై యామినీ శర్మ మండిపాటు
సోము వీర్రాజు రాసిన లేఖ ఇదీ..అధికార పార్టీ సభలకు డ్వాక్రా, మహిళా సంఘాలను ఆహ్వానించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అధికారిక ఉత్తర్వులు ఇచ్చిందా? అనేది చెప్పాలని సీఎస్‌కు సోము వీర్రాజు లేఖ రాశారు. డ్వాక్రా సంఘాల పాత్రను ప్రభుత్వ కార్యక్రమాల్లో పెంచాల్సింది పోయి, ఇలాంటివి చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని వీర్రాజు కోరారు.
ఇదీ చదవండి: