ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎటెళ్లాలో తెలియని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం' - AP Government

ఎటెళ్లాలో తెలియని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని భాజపా జాతీయ నేత రాంమాధవ్ ఎద్దేవా చేశారు. 370 రద్దుపై దేశమంతా హర్షం వ్యక్తమవుతోందని ఉద్ఘాటించారు. 1950 నుంచే 370 అధికరణం రద్దు చెయ్యాలంటూ పోరాడిన విషయం గుర్తుచేశారు.

రాంమాధవ్

By

Published : Sep 11, 2019, 10:49 PM IST

రాంమాధవ్

పార్టీలకతీతంగా 370 రద్దుపై దేశమంతా హర్షం వ్యక్తమవుతోందని... భారతీయ జనతా పార్టీ కీలక నేత రాంమాధవ్‌ వ్యాఖ్యానించారు. భారతదేశంలో అందరూ భాజపా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370 రద్దుపై విజయవాడలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ నిర్ణయం మంచిదేనని... ఆచరణ బాగోలేదని కాంగ్రెస్‌ వాళ్లు చెప్పిన విషయం గుర్తుచేశారు. 1950 నుంచే 370 అధికరణం రద్దు చెయ్యాలంటూ పోరాడుతూ వచ్చామని పేర్కొన్నారు. ఎవ్వరికీ చెప్పకుండా తీసుకున్న నిర్ణయం కాదని రాంమాధవ్‌ స్పష్టం చేశారు. వేరే వాళ్లకు కూడా వంద రోజులు పూర్తయ్యాయన్నారు. అమరావతి వైపు వెళ్లాలో... ఎటెళ్లాలో తెలియని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని రాంమాధవ్ ఎద్దేవా చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details