వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని..భాజపా మహిళా నేత పురందేశ్వరి విమర్శించారు. కార్పొరేషన్ల పేరిట వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ భాజపా కార్యాలయంలో జరిగిన జాతీయ పదాదికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ఎక్కడకూ తరలిచమని...కార్మికులకు న్యాయం జరిగేందుకు సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
వైకాపా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా..పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని పురందేశ్వరి ఆక్షేపించారు. రాష్ట్రంలో విధ్వంసక పాలన సాగిస్తూ..ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న భాజపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అమ్మఒడి పేరుతో నగదు ఇస్తూ...మద్యం రూపంలో లాగేస్తున్నారని విమర్శించారు. ఆటోవాలాకు రూ. 10 వేలు ఇస్తున్నామని చెప్పి..విపరీతమైన చలానాలతో లాకొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఇసుక ధరలు పెంచి నిర్మాణ రంగాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు.