లాక్డౌన్ వల్ల వచ్చిన స్ఫూర్తి అంతా... మద్యం దుకాణాలు తెరవటం వల్ల పూర్తిగా మంటగలిసిపోయిందని భాజపా నేత కామినేని శ్రీనివాస్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య కారణంగా... కరోనా వ్యాధి అధికంగా ప్రబలే అవకాశం ఉందన్నారు. మద్యం రేట్లు పెంచటం వల్ల పేదవారు నాటుసారాకు అలవాటుపడి... అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం అనేక పథకాలు తీసుకువస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం... ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అంతా నిరుపయోగంగా మారే అవకాశం ఉందన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేదానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన ప్రభుత్వానికి లాక్డౌన్ మంచి అవకాశమని... మద్యం దుకాణాలు తెరవకుండా అదే కొనసాగించాల్సిందన్నారు.
'ఆ ఒక్క చర్య వల్ల లాక్డౌన్ స్ఫూర్తి మంటగలిసింది' - bjp leader kamineni srinivas news
రాష్ట్రప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవటం వల్ల ఇన్నాళ్లు లాక్డౌన్ కారణంగా వచ్చిన స్ఫూర్తి అంతా... ఇప్పుడు మంటగలిసి పోయిందని భాజపా నేత కామినేని శ్రీనివాస్ విమర్శించారు. ఈ చర్యల వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని మండిపడ్డారు.
!['ఆ ఒక్క చర్య వల్ల లాక్డౌన్ స్ఫూర్తి మంటగలిసింది' bjp leader kamineni srinivas comments on govt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7129177-785-7129177-1589024047244.jpg)
భాజపానేత కామినేని శ్రీనివాస్
మద్యం దుకాణాలు తెరవడంపై భాజపా నేత కామినేని విమర్శలు
ఇవీ చదవండి...
Last Updated : May 9, 2020, 10:45 PM IST