ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీయించారు' - BJP state president Somu veeraju latest news

వైకాపా ప్రభుత్వం.. సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే లక్ష్యంగా పనిచేసి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని భాజపా నాయకులు విమర్శించారు. బిల్డ్​ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని నేతలు వ్యతిరేకించారు. విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

bjp core committee meeting
భాజపా రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం

By

Published : Jun 13, 2021, 9:53 PM IST

రైతుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డదారిలో ఆస్తిపన్నులు పెంచడం సిగ్గుచేటని మండిపడ్డారు. పెంచిన పన్నును విరమించే వరకు భాజపా, జనసేన ఆందోళనలు కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. విశాఖ భూ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలో కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం.. సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే లక్ష్యంగా పనిచేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిందని భాజపా నాయకులు విమర్శించారు. బిల్డ్​ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని నేతలు వ్యతిరేకించారు. తెలుగుదేశంతో భాజపా ఎట్టి పరిస్థితుల్లో కలవదని స్పష్టం చేశారు.

వ్యాక్సినేషన్ డ్రైవ్​లో..

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించినట్లు మాధవ్‌ తెలిపారు. వ్యాక్సినేషన్ డ్రైవ్​లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్ణయించినట్లు వివరించారు. అన్నదాతలకు అండగా ఉద్యమించాలని తీర్మానించామని.. 21 రోజుల్లోనే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి..

suhasini case: 'సుహాసిని వల్ల నష్టపోయాను'.. తెరపైకి రెండో భర్త వినయ్

చేపల కోసం వల వేస్తే.. కొండ చిలువ చిక్కింది!

ABOUT THE AUTHOR

...view details