ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అర్చకులకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం' - Brahmin Corporation Latest News

దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు ఇవ్వడాన్ని భాజపా ధార్మిక సెల్ కన్వీనర్ చైతన్య శర్మ స్వాగతించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన వారి వడ్డీలు మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

'అర్చకులకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం'
'అర్చకులకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం'

By

Published : Apr 28, 2020, 6:43 PM IST

దేవాలయాల్లో పని చేస్తూ... రూ.5 వేలు కంటే తక్కువ ఆదాయం ఉన్న అర్చకులకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భాజపా ధార్మిక సెల్​ కన్వీనర్ చైతన్య శర్మ అన్నారు. పేద బ్రాహ్మణులకు, అర్చకులకు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం చేయాలని ఆయన కోరారు. ఆ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన వారి వడ్డీలు మాఫీ చేయాలన్నారు. రంజాన్ ప్రార్థనలకు కల్పించిన వెసులుబాటును వ్యతిరేకిస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో భయానక పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఉగాది, ఈస్టర్​ పండగలను ఇంట్లోనే చేసుకున్నట్లు రంజాన్ కూడా ఇంటి వద్దనే జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జగద్గురు శంకరాచార్య జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి పూజించారు. అస్పృశ్యతను రూపుమాపేందుకు శంకరాచార్య చేసిన కృషి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details