ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనకు భాజపా పిలుపు

పశ్చిమ బంగాల్​లో భాజపా కార్యకర్తలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు చెప్పారు. తృణమూల్ నేతలే దాడుల వెనక ఉన్నారని ఆరోపించారు. రేపు ఉదయం 11 నుంచి ఓ గంటపాటు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇళ్లలో ఉండి నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

bjp state president call for protest
రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు భాజపా పిలుపు

By

Published : May 4, 2021, 8:00 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టబోతున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై మమతా బెనర్జీ అనుచరులు భౌతిక దాడులు, హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు.. ఎవరింట్లో వారు కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ నిరసన తెలపాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఇదీ చదవండి:'నందిగ్రామ్ రిటర్నింగ్​ అధికారికి పూర్తి భద్రత'

"దేశంలో ఎక్కడాలేని విధంగా పశ్చిమ బంగాల్​లో టీఎంసీ గూండాలు దాడులకు తెగబడ్డారు" అని సోము వీర్రాజు విమర్శించారు. అక్కడి భాజపా కార్యకర్తలు, ఆస్తులు, కార్యాలయాలు, నాయకులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపు ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details