తెదేపా అధినేత చంద్రబాబుకు పలువురు ప్రముఖలు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ ట్వీటర్లో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్ బిశ్వభూషణ్ ఆయనకు..జగన్నాథుడు, వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.
కోట్ల మందికి అన్నదాత అయ్యారు: చంద్రబాబుకు ఆయన తనయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారని.. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాది మందికి అన్నదాత అయ్యారని పేర్కొన్నారు. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సూపర్ స్టార్ చంద్రబాబుకు.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.