రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. నేడు 88న వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా.. రాజ్‌భవన్‌లో వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.
సీఎం జగన్ శుభాకాంక్షలు
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా చరవాణిలో గవర్నర్‌తో మాట్లాడి యోగక్షేమాలు విచారించి, తన తరుపున సీఎంఓ నుంచి ఉన్నతాధికారులను పంపి ప్రత్యేకతను చాటారు. గవర్నర్ ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
అనాథలకు దుస్తుల పంపిణీ
మరోవైపు గవర్నర్ జన్మదినం సందర్భంగా.. నగరంలోని ఎస్ కెసీవీ బాలల ట్రస్ట్‌లో.. అనాథ బాలలకు రాజ్ భవన్ తరుపున నూతన వస్త్రాలు అందించారు. నగరంలో ట్రస్ట్ కు చెందిన మూడు కేంద్రాలు ఉండగా అక్కడి 40 మంది బాలలకు గవర్నర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజనంతో పాటు వస్త్రాలు పంపిణీ చేశారు.