మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకి జన్మనిచ్చింది. కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన మహిళకు.. ఒంటికన్నుతో మగశిశువు పుట్టినట్లు వైద్యులు తెలిపారు.
ప్రభుత్వాస్పత్రిలో వింత శిశువు జననం - వింత శిశువుకి జన్మనిచ్చిన మహిళ
ప్రభుత్వాస్పత్రిలో ఒంటికన్నుతో శిశువు జన్మించింది. పుట్టిన గంట తర్వాత మృతి చెందింది. జన్యుపరమైన లోపాలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది.
ప్రభుత్వాస్పత్రిలో వింత శిశువు జననం
పుట్టిన గంట తర్వాత... శిశువు మృతి చెందినట్లు వెల్లడించారు. జన్యుపరమైన లోపాల కారణంగా... వింత ఆకారంలో శిశువు జన్మించాడని వైద్యులు ధృవీకరించారు.