ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వల్ల 2020 మే నుంచి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. కొవిడ్ తగ్గడంతో మళ్లీ బయోమెట్రిక్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Biometric: ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ - ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
15:19 August 24
ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
ఈ మేరకు బయోమెట్రిక్ పరికరాలు సిద్ధం చేయాలని ఐటీ శాఖకు సీఎస్ ఆదేశాలిచ్చారు. సచివాలయం, అన్ని హెచ్‌వోడీ కార్యాలయాలు, కలెక్టరేట్లు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేయనున్నారు. రాష్ట్ర విభాగాలు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని సీఎస్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Last Updated : Aug 24, 2021, 4:27 PM IST