హైదరాబాద్ నగర శివారు మియాపూర్ ఠాణా పరిధి మదీనాగూడలోని రిలయన్స్ డిజిటల్ షోరూంలో భారీ దొంగతనం జరిగింది. ఈ షోరూంలో సుమారు రూ. 40 లక్షల నుంచి 50లక్షల వరకు విలువైన సెల్ఫోన్లు దొంగతనానికి గురయ్యాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ దుకాణంలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఈ రోజు ఉదయం షోరూంను తెరిచి లోపలికి వెళ్లేసరికి సెల్ఫోన్లు చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించిన సిబ్బంది.. యాజమాన్యానికి సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.