ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 15, 2020, 10:54 PM IST

ETV Bharat / city

సుందర భవానీ ద్వీపం... వరద నీటిలో దిగ్బంధం

కృష్ణా నదికి వరద పోటెత్తడంతో విజయవాడలోని పర్యాటక ప్రాంతాలు కళా విహీనంగా మారాయి. ముఖ్యంగా ఎన్నో అందాలతో పర్యటకులను ఆకర్షించే భవానీ ద్వీపాన్ని వరద దిగ్బంధించింది. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్కులు నీటిలో మునిగిపోయాయి.

bhavani dweepam
bhavani dweepam

సుందర భవానీ ద్వీపం... వరద నీటిలో దిగ్బంధం

కృష్ణా నదీ తీరంలో ఉన్న అత్యద్భుత పర్యాటక కేంద్రాల్లో విజయవాడ ఒకటి. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో కృష్ణమ్మ పరుగులు, వడ్డానంలా ప్రకాశం బ్యారేజీ, కొండపై దుర్గమ్మ ఆలయం కనువిందు చేస్తుంటాయి ఇక్కడ. వీటికి తోడు అహ్లాదానికి చిరునామాగా మారిన భవానీ ద్వీపంతో పర్యటకులకు స్వర్గధామంగా పేరొందింది. పర్యాటక బోట్లలో నదిలో విహరిస్తూ ప్రకృతి అందాలను వీక్షించేందుకు నిత్యం వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు.

అయితే ఉవ్వెత్తున వచ్చిన వరద బెజవాడలోని పర్యాటక ప్రాంతాలను ముంచేసింది. ఎన్నో ప్రత్యేకతలతో అందరినీ ఆకట్టుకునే భవానీ ద్వీపం పూర్తిగా నీట మునిగింది. దీనివల్ల పర్యాటక అందాలు కనుమరుగయ్యాయి. వరదతో పర్యాటకంలో బెజవాడకే తలమానికంగా మారిన భవానీ ద్వీపానికి వచ్చిన దుస్ధితిని మా ప్రతినిధి వెంకటరమణ వివరిస్తారు.

ABOUT THE AUTHOR

...view details