విజయవాడ ఇంద్రకీలాద్రిపై అరుణవర్ణం ప్రకాశిస్తోంది. దుర్గమ్మ దర్శణం కోసం.. భవానీ భక్తులు భారీగా పోటెత్తుతుండడతో.. "జై భవానీ" నామస్మరణ మారుమోగుతోంది. అయితే.. వీరిలో చాలామంది అమ్మవారిని విజయదశమి రోజునే దర్శించుకున్నారు. అయితే.. విజయదశమి రోజు శుక్రవారం కావడంతో.. మాల తీయలేక పోయారు. ఇవాళ అమ్మవారిని దర్శించుకుని మాల తీస్తున్నారు.
Indhrakeeladri: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ భక్తులు.. అధికారుల కీలక నిర్ణయం - vijayawada temple rush
ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. మాలధారులు భారీగా తరలి వస్తుండటంతో క్యూలైన్లు రద్దీగా మారాయి. దీంతో.. అమ్మవారి దర్శనం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దీంతో.. కృష్ణా తీరంలో భవానీల సందడి అధికంగా కనిపిస్తోంది. నిన్నటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ అంతకంతకూ పెరిగి పోతుండడంతో.. ప్రముఖులు, ప్రొటోకాల్ దర్శనాలపై అధికారులు ఆంక్షలు విధించారు. రెండు రోజులపాటు వీఐపీ, కాల్ దర్శనాలు రద్దు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో.. భక్తులందరికీ సాధారణ దర్శనాలే అందుబాటులో ఉన్నాయి. భవానీలు భారీగా వస్తుండడంతో.. ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. మొత్తం 12 కౌంటర్ల ద్వారా ప్రసాదం అందిస్తున్నారు.
ఇదీ చదవండి: