సామాజిక సేవలో భాగంగా దిల్లీ కేంద్రంగా 1963లో ఏర్పడిన భారత్ వికాస్ పరిషత్ సంస్థ.. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కరోనాతో యావత్ భారతం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో మరోసారి ఆపన్నహస్తం అందించేందుకు... విజయవాడ నగర పాలక సంస్థ పిలుపు మేరకు నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు, పేదల కడుపునింపుతోంది. నిత్యం 3 వేల మందికి భోజనం ప్యాకెట్లు అందిస్తోంది.
భారత్ వికాస్ పరిషత్.. తమ సభ్యులు, స్నేహితుల నుంచి విరాళాలు సేకరించి సేవా కార్యక్రమాలు చేపడుతోంది. విజయవాడలోని మూడు సర్కిళ్లలో నిత్యం 2,500 మంది పారిశుద్ధ్య కార్మికులు, మరో 500 మంది నిరాశ్రయులకు భోజన వసతి కల్పిస్తోంది.