కృష్ణా జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగించింది. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ వామపక్ష పార్టీలు, కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
విజయవాడలో
కాంగ్రెస్, వామపక్షాలు, ఆప్, రైతుల సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో రాస్తారోకో చేపట్టారు. సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత మధు, ఇతర నేతలు రోడ్లపై బైఠాయించారు. బంద్‌కు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. భారత్ బంద్‌కు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాల మద్దతు ప్రకటించాయి.
పెనమలూరులో
పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు, పోరంకి, కంకిపాడు, ఉయ్యూరు గ్రామాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ఉదయం నుంచి ప్రభుత్వ రవాణా పూర్తిగా నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
నందిగామలో
నందిగామలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపారులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛందంగా మూసివేసి అధికారులు బంద్‌కు సహకరించారు. అన్ని విద్యా సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. వామపక్షాలు, కాంగ్రెస్, బహుజన సమాజ్ వాది పార్టీ, రైతు సంఘాలు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
పామర్రు నియోజకవర్గంలో