ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: సీఎంఆర్​ఎఫ్​కు భారత్ బయోటెక్ భారీ విరాళం

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి... భారత్​ బయోటెక్ సంస్థ​ 2 కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది. ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రిని సంస్థ ఛైర్మన్​, ప్రతినిధులు కలిసి చెక్కును అందించారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్​ ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.

bharat-bio-tech-donate-two-crores-to-telanagana-chief-minister-relief-fund
bharat-bio-tech-donate-two-crores-to-telanagana-chief-minister-relief-fund

By

Published : May 5, 2020, 7:01 PM IST

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి భారత్ బయోటెక్ కంపెనీ 2 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందించింది. కంపెనీ ఛైర్మన్​, మేనేజింగ్​ డైరెక్టర్ కృష్ణ ఎమ్​. ఎల్లా, కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర కె. ఎల్లా, ప్రెసిడెంట్ సాయి డి. ప్రసాద్ ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిసి చెక్కును అందించారు. కరోనా వైరస్ నిర్మూలనకు త్వరలోనే వ్యాక్సిన్​ ఆవిష్కరించనున్నట్లు ఛైర్మన్​ కృష్ణ ఎమ్. ఎల్లా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details