ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జస్టిస్ ఎన్వీ రమణ పదోన్నతితో... బెజవాడ బార్ అసోసియేషన్​లో సంబరాలు - బెజవాడ బార్ అసోసియేషన్ సంబరాలు

జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడంపై బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఉన్నతమైన పదవికి తెలుగు వ్యక్తి ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.

celebrations in bejawada bar association, bejawada bar association members on justice nv ramana promotion
బెజవాజ బార్ అసోసియేషన్​లో సంబరాలు, జస్టిస్ ఎన్వీ రమణ పదోన్నతిపై బెజవాడ బార్ అసోసియేషన్ హర్షం

By

Published : Apr 7, 2021, 3:46 PM IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి ఎన్.వి. రమణ నియమితులు కావడం సంతోషంగా ఉందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి.పి. రామకృష్ణ అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. కేక్ కట్ చేసి సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

విజయవాడలో అన్ని వసతులతో ఉన్న భవనం న్యాయవాదులకు త్వరలో అందుబాటులోకి రాబోతుందని.. దీని వెనుక జస్టిస్ ఎన్వీ రమణ కృషి ఉందని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ న్యాయసేవలు అందాలని ఆకాంక్షించే వ్యక్తి జస్టిస్ ఎన్​.వి. రమణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details