విజయవాడలో ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీ సేఫ్ యాప్ను మంత్రులు సుచరిత, వనిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళలకు మంత్రి సుచరిత తెలిపారు. మహిళల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఎవరైనా ఇబ్బంది పెట్టినా, టీజ్ చేసినా టోల్ ఫ్రీకి కాల్ చేయాలన్నారు. మహిళామిత్ర, సైబర్‌మిత్ర మీకు అండగా ఉంటాయని పేర్కొన్నారు. సైబర్ క్లబ్‌లో చేరి ప్రతి ఒక్కరూ సైబర్ పోరాటయోధులు కావాలన్నారు. త్వరలో కళాశాలలకు వెళ్లి సమీక్షలు నిర్వహిస్తామని డీజీపీ పేర్కొన్నారు.
ఎవరైనా ఇబ్బంది పెడితే.. కాల్ చేయండి! - బీ సేఫ్ యాప్ న్యూస్
చరవాణుల వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని మహిళలకు మంత్రి సుచరిత సూచించారు. రక్షణగా ఉన్నామని భరోసానిచ్చారు.
be safe app started by home ninister sucharithabe safe app started by home ninister sucharitha