చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సేన డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క్రిష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అఖిల పక్షాన్ని, బీసీ సంఘాలను ప్రధాని వద్దకు తీసుకు వెళ్లి ఒత్తిడి చేయాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఓబీసీ బిల్లుతో బీసీలకు ఎటువంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాధికారం సాధించే దిశగా బీసీలంతా ఐక్య ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి :ఆర్ క్రిష్ణయ్య - BC Welfare Leaders Meeting in Vijayawada
గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు 60 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారన్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క్రిష్ణయ్య అన్నారు. 20 శాతం ఉన్న రిజర్వేషన్లను 50 శాతం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
![చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి :ఆర్ క్రిష్ణయ్య R. Krishnaiah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12809692-418-12809692-1629287263102.jpg)
ఆర్ క్రిష్ణయ్య