ఈనెల 11న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ సంక్రాంతి పేరిట ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని...వారిచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కార్యక్రమం నిర్వహణ కోసం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వేణుగోపాల కృష్ణ, వెలంపల్లి ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
ఏలూరు బీసీ గర్జనలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్...కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. వెనుకబడిన తరగతుల కోసం ఇన్ని కార్పొరేషన్లను దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయలేదన్నారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చారని...మొత్తం 56 మంది ఛైర్మన్లు, 673 మంది డైరెక్టర్లను నియమించారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 11వ తేదీ మధ్యాహ్నం ౩ గంటల నుంచి 6 గంటల వరకు బీసీ సంక్రాంతి కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.