విద్యుత్ శాఖలో తమకు ప్రమోషన్లు, గుర్తింపు ఇవ్వాలని బీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలో సమావేశమయ్యారు. బీసీ హక్కుల సాధన నాయకుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీసీలు తమ హక్కుల సాధనకోసం ఉద్యమం చేపట్టాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. అర్హులైనవారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్ని నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
''విద్యుత్ శాఖలో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కావాలి'' - latest news on BC power employees
బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘ గుర్తింపును పునరుద్ధరించాలని బీసీ సంఘం నాయకులు విజయవాడలో సమావేశం నిర్వహించారు.

బీసీ విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లు,గుర్తింపు కావాలి