బీసీల కోసం కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు నిర్ణయాన్ని బీసీ సామాజిక వర్గ మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు స్వాగతించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం బీసీల అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రులు శంకరనారాయణ, ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వారి ప్రయోజనాల కోసం సీఎం ఎంతో కృషి చేస్తున్నారని ప్రసంశించారు.
'బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు నిర్ణయం స్వాగతించదగినది'
బీసీల కోసం 28 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతించారు. ఈ నిర్ణయంతో వారు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
'బీసీ కార్పోరేషన్ల ఏర్పాటు నిర్ణయం స్వాగతించదగినది'
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, మహిళల పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించారని.. మంత్రి వర్గంలోనూ బీసీలకు పెద్ద పీట వేశారని అన్నారు. పాదయాత్రలో బీసీల బాధలు తెలుసుకున్న జగన్.. కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే 28 కార్పొరేషన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.