బీసీలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకే బీసీ కులాల కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సంక్రాంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభ చరిత్రాత్మక సభగా జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు బీసీలను నిర్లక్ష్యం చేశాయని ఆయన విమర్శించారు.
బీసీల సంక్రాంతి సభ చరిత్రాత్మకం: మంత్రి వేణుగోపాల్ - vijayawada latestnews
బీసీలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకే బీసీ కులాల కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పష్టం చేశారు. బీసీల సంక్రాంతి సభ ఘనంగా జరిగిందన్నారు.
బీసీల సంక్రాంతి సభ చరిత్రాత్మకం: మంత్రి వేణుగోపాల్
ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ సీఎంగా ప్రమాణం చేశారో.. అక్కడే బీసీల సభ నిర్వహించారన్నారు. ఇది బీసీల సభ కాదని.. బీసీలను యనమల అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన బీసీలను అవమానపరచవద్దని వేణుగోపాల్ హితవుపలికారు.