వైకాపాకు ఆ పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సప్పా వెంకటశివప్రసాద్, విజయవాడ నగర బీసీ సెల్ అధ్యక్షుడు బోను రాజేశ్ రాజీనామా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు.. బీసీ నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం పార్టీలో జరుగుతోందని అన్నారు. వైకాపా ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేసినా... తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరినా... పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. పార్టీ తమ సేవలను గుర్తించటం లేదని.. ఈ నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నామన్నారు.
వైకాపాకు బీసీ సెల్ నేతల రాజీనామా - ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2021
వైకాపాకు ఆ పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సప్పా వెంకటశివప్రసాద్, విజయవాడ నగర బీసీ సెల్ అధ్యక్షుడు బోను రాజేశ్ రాజీనామా చేశారు.
ap municipal elections 2021