ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 27, 2020, 4:00 PM IST

ETV Bharat / city

'పీజీ వైద్య విద్యార్థులను చేర్చుకునేలా చర్యలు తీసుకోండి'

జీవో 56ను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వ్యతిరేకించటం సరికాదని బీసీ సంఘం నేతలు వ్యాఖ్యానించారు. సీట్లు పొందిన పీజీ వైద్య విద్య విద్యార్ధులను ప్రైవేట్ కాలేజీలు చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీకి వినతిపత్రం సమర్పించారు.

'పీజీ వైద్య విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు చేర్చుకునేలా చర్యలు తీసుకోండి'
'పీజీ వైద్య విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు చేర్చుకునేలా చర్యలు తీసుకోండి'

పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్​లో సీట్లు పొందిన విద్యార్ధులను ప్రైవేట్ కాలేజీలు చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసి సంఘాల నేతలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసి డాక్టర్​ శ్యామ్ ప్రసాద్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు నష్టపోకుండా జీవో 56 ను అమలు చేయాలని బీసీ సంఘాల నాయకులుకోరారు. ప్రభుత్వం పేద విద్యార్ధులకు వైద్య విద్యను అందించేందుకు ఈ జీవోను తీసుకువచ్చిందని.. దీనిని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వ్యతిరేకించటం సరికాదని బీసీ సంఘం అధ్యక్షులు కేశవ శంకరరవావు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని.. కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకుంటామని విశ్వవిద్యాలయ వీసీ స్పష్టం చేశారు. విద్యార్ధులను కళాశాలల్లో చేర్చుకునేందుకు గడువు తేదీని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తామని వీసీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details