రాజ్‌భవన్‌లో బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరు, వాడా, పల్లె, పట్నాల్లో రంగురంగుల బతుకమ్మలతో మహిళలు సందడి చేశారు. హైదరాబాద్లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ ఆడారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఆటపాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.