మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ పోలీసులు.. కుమారుల వద్దకు చేర్చారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు మతిస్థిమితం సరిగా లేదు. ఎనిమిది నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబీకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో దేవరపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Humanity: తప్పిపోయిన తల్లి..కుమారుల వద్దకు చేర్చిన ఛత్తీస్గఢ్ పోలీసులు - Bastar police escort missing mother to sons
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్(basthar) పోలీసులు మానవత్వం చాటుకున్నారు. కుమారుల నుంచి తప్పిపోయి ఒంటరిగా తిరుగుతున్న మహిళను తిరిగి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. తప్పిపోయిన తల్లిని తిరిగి తమకు అప్పగించినందుకు బస్తర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
తప్పిపోయిన తల్లిని కుమారుల వద్దకు చేర్చిన బస్తర్ పోలీసులు
ఈ క్రమంలో.. బస్తర్లో అనుమానాస్పదంగా తిరుగతూ, తెలుగులో మాట్లాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో మహిళను చేరదీసిన పోలీసులు ఆమె వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు. తప్పిపోయిన తల్లిని.. తిరిగి తమ వద్దకు చేర్చిన పోలీసులకు బాధితురాలి కుమారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచదవండి.