ఉగాదికి సెలవు ప్రకటించకపోవడంపై ఉద్యోగుల అభ్యంతరం.. సీఎం, సీఎస్‌కు లేఖ - demond for ugadi holiday
13:39 March 24
సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ
ఉగాది పర్వదినాన బ్యాంకులకు సెలవు ప్రకటించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏప్రిల్ 2న బ్యాంకులకు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో యూనియన్ కన్వీనర్ రాంబాబు విజ్ఞప్తి చేశారు. తెలుగు సంవత్సరాదికి సెలవు ఇవ్వకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఉగాది పండుగను వైభవంగా జరుపుకుంటారని లేఖలో వివరించారు.
ఇదీ చదవండి : సీఎం జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు