BANK EMPLOYEES PROTEST AT VIJAYAWADA: బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు విజయవాడలో ఆందోళనకు దిగారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ ఆధ్వర్యంలో వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ఆందోళనకు సంఘీభావం తెలిపిన తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణలు మాట్లాడుతూ.. 28 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనాల పేరుతో 12కు కుదించారన్నారు.
దేశంలో కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్లిన వారిని పట్టుకోలేదని.. ఎంతోమంది జీవితాలను నాశనం చేసి కూడా దర్జాగా బయట దేశాల్లో వారు బతుకుతున్నారని నేతలు అన్నారు. ప్రైవేటు సంస్థలను వదిలేసి.. ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేయడం అన్యాయమన్నారు. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు.