ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ప్రతినిధులు.. విజయవాడ ధర్నా చౌక్‌లో బ్యాంకు ఉద్యోగులతో కలిసి నిరసన చేపట్టారు. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నట్లు చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.
ఒక్క బ్యాంకింగ్ రంగాన్నే కాకుండా.. ఉక్కు కర్మాగారం, ఎల్ఐసీ అన్నింటినీ.. ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.