ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.80లకే ఇవ్వొచ్చు"

Bandi Sanjay on Petrol Price: తెలంగాణ సీఎం కేసీఆర్‌ పర్యటనపై.. ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు.. సీఎం కేసీఆర్‌ 8 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమి లేదు కానీ.. దేశాన్ని ఉద్దరిస్తాడటా అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ పెట్రోల్‌పై 30రూపాయల వ్యాట్‌ విధిస్తున్నారని.. దానిని తగ్గిస్తే రాష్ట్రంలో 80 రూపాయలకే పెట్రోల్‌ లభిస్తుందన్నారు.

Bandi Sanjay on Petrol Price
తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.80లకే ఇవ్వొచ్చు

By

Published : May 22, 2022, 2:18 PM IST

తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.80లకే ఇవ్వొచ్చు: బండి సంజయ్

Bandi Sanjay on Petrol Price: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావమున్నా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించిందని.. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పెట్రో ధరలు తగ్గించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘లీటర్‌ పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.30 పన్ను విధిస్తోంది. రాష్ట్రం వ్యాట్‌ తగ్గిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే ఇవ్వొచ్చు. దోచుకున్న సొమ్ము దాచుకునేందుకే కేటీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. సీఎం కేసీఆర్‌ ఇక్కడ చేసిందేమీ లేదు కానీ.. దేశాన్ని ఉద్ధరిస్తారట. ఇక్కడ జీతాలిచ్చే పరిస్థితి లేదు.. కానీ ఇతర రాష్ట్రాల వారికి సాయం చేస్తారట. రాష్ట్రంలో పింఛన్లు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. కొండగట్టులో ప్రజలు చనిపోతే సీఎం పరామర్శించారా? సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చనిపోతే వారినైనా పరామర్శించారా?’’ బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details