కరోనా నేపథ్యంలో నగరంలో నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలు విధించగా.. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్రతీ ఏడాదీ నగరవాసులతో కిక్కిరిసిపోయే బందర్ రోడ్డు.. ఈసారి బోసి పోయింది. వాహనదారులు రాకుండా ఎక్కడిక్కడ పోలీసులు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. రహదారులకు ఇరువైపుల ఉన్న రోడ్లు బారికేడ్లతో మూసేశారు. ఇవన్నీ దాటుకుని కొందరు చిన్న చిన్న వీధుల్లో నుంచి రోడ్లపైకి వచ్చినా.. పోలీసులు వారిని వెనక్కి పంపారు. ప్రార్థనా మందిరాలకు మాత్రమే అనుమతినిచ్చారు.
విజయవాడ సీపీ బి. శ్రీనివాసులు.. నగరంలోని ప్రధాన రహదారులపై పర్యటించారు. నగరవాసులు సహకారంతోనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేలా చేయగలిగామని తెలిపారు. కొత్త రకం కరోనా వ్యాపిస్తున్న క్రమంలో అనేక మంది తమ గృహాల్లోనే వేడుకలు జరుపుకున్నారు.